logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రెండో పెళ్ళికి సిద్దమైన టాలీవుడ్ హీరో.. అమ్మాయి ఎవరంటే?

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ కి పరిచయమైన మంచు మనోజ్ విభిన్నమైన కథలతో సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015 లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనోజ్ కెరీర్ ఎన్నో ఒడిదుడుకులకు గురైంది.

వ్యక్తిగత జీవితంలో సమస్యలతో మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్యతో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తూ బిజీగా గడుపుతుంది. కాగా మనోజ్ కు రెండో పెళ్లి చేయాలని మంచు ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తుంది. కాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ తో మనోజ్ చనువుగా ఉంటున్నాడన్న వార్తలు అప్పట్లో వచ్చాయి.

ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు మరో కొత్త వార్త తెరపైకి వచ్చింది. మోహన్ బాబు కుటుంబానికి సన్నిహితులైన అమ్మాయితో వివాహం జరగనుందని ఆ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. అంతే కాకూండా వీరి ఇద్దరి పెళ్లి మే నెలలోనే జరగనుందని తెలుస్తుంది.

కాగా ఈ విషయంపై మంచు ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం మంచు మనోజ్ చాలా గ్యాప్ తీసుకుని ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.

Related News