logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

భూతవైద్యుడి దాడిలో గాయపడిన బాలింత మహిళ మృతి

మంచిర్యాల జిల్లా కుందారంలో భూత వైద్యం పేరుతో బాలింత మహిళను చిత్ర హింసలకు గురి చేసిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన రజిత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ కు చెందిన రజిత చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. ఏడాది క్రితం మల్లేష్ అనే యువకుడిని ప్రేమవివాహం చేసుకున్నారు. పెళ్ళైన నాటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రజిత నాలుగు నెలల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

ఈ నేపథ్యంలో ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అత్తింటి వారు, రజిత బాబాయి కలిసి దొగ్గల శ్యామ్ అనే భూత వైద్యుడిని పిలిపించారు. అతను రజితకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని చెప్పి విచక్షణా రహితంగా కొట్టాడు. తల వెంట్రుకలు లాగి, కొడుతూ మంచంపై పడేసాడు. ఆమె తలకు గాయం కావడంతో రజిత స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

ఐదు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న రజిత సోమవారం మరణించారు. ఆమె మరణంతో ముక్కు పచ్చలారని పసికందు తల్లిలేనిదయ్యింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో అత్తింటి వారిపై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. భూతవైద్యుడు శ్యామ్, అతనికి సహకరించిన రజిత బాబాయిని రెస్టు చేసారు. ఈ కేసుపై విచారం ముమ్మరం చేసారు.

Related News