logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి

ఒక‌వైపు పెట్రోల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నందున ఇప్పుడిప్పుడే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పైన ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే, వ‌రుస‌గా జ‌రుగుతున్న ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ ప్ర‌మాదాలు ఇప్ప‌టికే ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. త‌ర‌చూ ఎక్క‌డో ఒక చోట ఎల‌క్ట్రిక్ వాహనాలు అగ్రి ప్ర‌మాదాలకు గురయ్యాయ‌ని, బ్యాట‌రీ పేలింద‌నే వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇవి ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు ఇప్ప‌టికే కొన్న వారిని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఇప్పుడు కొనాల‌నుకునే వారిని వెన‌క‌డుగు వేసేలా చేస్తున్నాయి.

తాజాగా, ఎల‌క్ట్రిక్ బైక్‌కు సంబంధించి జ‌రిగిన మ‌రో ప్ర‌మాదం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. శ్రీనాథ్ మీన‌న్ అనే వ్య‌క్తి త‌న ఓలా ఎస్‌1 ప్రో ఎల‌క్ట్రిక్ బైక్ ఫోటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటో ఓలా బైక్ ముందు టైర్ బైక్ నుంచి పూర్తిగా వేరుప‌డి బైక్ కుప్ప‌కూలింది. మామూలు స్పీడ్‌లో ఉన్న‌ప్పుడే ఇలా బైక్ ముందు భాగం విరిగిపోయింద‌ని వాహ‌న‌దారుడు వాపోయాడు.

నాసిర‌క‌మైన మెటీరియ‌ల్ ఉప‌యోగించి వాహ‌నాల‌ను త‌యారుచేసినందునే ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని అత‌డు ఆరోపించాడు. కాబ‌ట్టి, వెంట‌నే వాహ‌నాల డిజైన్ మార్చాల‌ని, రిప్లేస్ చేసి త‌మ ప్రాణాలు కాపాడాల‌ని కోరాడు. ఈ మేర‌కు ఆయ‌న ఓలా సీఈవో భావిష్ అగ‌ర్వాల్‌కు ట్వీట్ చేశాడు.

 

 

Related News