logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

పెళ్ళైన తొలిరోజే.. భార్యను చంపి భర్త ఆత్మహత్య..!

పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. పెళ్ళైన తొలి రాత్రే నవ జంట శవాలుగా మారారు. తమిళనాడులోని తిరువలూరు జిల్లాకు చెందిన నిధివాసన్, సంధ్యలకు బుధవారం ఉదయం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఆ రోజు రాత్రే వీరిద్దరికి తొలి రాత్రి ఏర్పాటు చేసారు. కాగా ఉదయం తలుపులు తెరిచి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూసి ఖంగుతిన్నారు.

సంధ్య రక్తపు మడుగులో పడి ఉంది. నిధివాసన్ ఇంటి సమీపంలోని ఓ పొలంలో ఉరివేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదిలో రక్తపు మరకలు అంటిన స్టీలు రాడ్డును గుర్తించామని దానితోనే నిధివాసన్ సంధ్యను చంపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్టుగా తేల్చారు.

భార్య భర్తల మధ్య జరిగిన వివాదం కారణంగానే నిధివాసన్ భార్యను కొట్టి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లై 24 గంటలు గడవకముందే తమ కూతురు ఇలా భర్త చేతిలో హత్య చేయబడిందని సంధ్య కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఆ రాత్రి ఏం జరిగి ఉండవచ్చనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News