లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. ఉద్యోగం పోయిన బాధలో ఉన్న అతడికి ఏకంగా రూ.46 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతడి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. న్యూజిల్యాండ్‌లో జరిగింది ఈ సంఘటన. వెల్లింగ్టన్కు చెందిన ఓ వ్యక్తికి లాక్డౌన్ కారణంగా ఉద్యోగం పోవడంతో గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు.
ఓ కంపెనీ నుంచి గతంలో ఎప్పుడో ఓ లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న సదరు వ్యక్తి ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా లాటరీ ఫలితాలు కనిపించాయి. దీంతో తాను కొన్న లాటరీ టిక్కెట్‌ను వెతికి చూడగా తన టిక్కెట్‌పై రూ.46 కోట్ల లాటరీ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోంది.ఈ డబ్బులతో మంచి ఇల్లు కట్టుకొని పిల్లలను బాగా చదివించాలని సదరు వ్యక్త ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటున్నాడు.