logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

15 ఏళ్ల క్రితం అత్యచారం.. ఇప్పుడు గుర్తొచ్చింది..నిందితుడి అరెస్ట్!

15 ఏళ్ల క్రితం యువతిపై అత్యాచారం చేసిన వ్యక్తిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు(28) వివాహం జరిగిన తరువాత కూడా కొన్నేళ్లుగా ఓ వ్యక్తి(31) తో వివాహేతర సంబంధం కొనసాగించింది. అతను కూడా వివాహితుడే. వీళ్లిద్దరి విషయం తెలియడంతో బాధితురాలి భర్త ఆమెను ఇంట్లో నుండి పంపించేశాడు.

దీంతో ఆమె తన ప్రియుడి వద్దకు వచ్చేసింది. అతను ఆమెను రెండో భార్యగా స్వీకరించి కొద్దీ రోజులు కాలం గడిపాడు. ఇటీవల ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఆమె ప్రియుడు కూడా ఆమెను ఇంట్లో నుంచి పంపించేశాడు. గత్యంతరం లేకపోవడంతో గతాన్ని వెలికితీసింది. ప్రియుడు తనపై 15 ఏళ్ల క్రితం అత్యాచారం చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ప్రియుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. టెస్టుల రిపోర్టులు అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కొట్వాలీ పోలీసులు వెల్లడించారు.

Related News