logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

డార్లింగ్ పేరుతో యూట్యూబ్ లో భార్య నగ్న ఫోటోలు.. దర్యాప్తులో సంచలన విషయాలు!

కట్టుకున్న భార్య నగ్న చిత్రాలను యూట్యూబ్ లో ఉంచి డబ్బులు సంపాదించాలన్న వ్యక్తిని గుంటూరు దిశా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి అకృత్యాలను వెలుగులోకి తెచ్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన బొంతా వంశీకాంత్‌రెడ్డి గతంలో హైద్రాబాదులోని సౌదీ ఎయిర్ లైన్స్ కార్గో విభాగంలో కొంతకాలం పనిచేసాడు.

అక్కడ ఉద్యోగం మానేసి ఆరేళ్ళ క్రితం భార్యతో కలిసి గుంటూరు ఏటీ అగ్రహారానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు కొరియర్ పాయింట్ వ్యాపారం చేసి నష్టాలపాలయ్యాడు. దీంతో కొంతకాలంగా పనీ పాటా లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మరో వ్యాపారం చేస్తానని పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని భార్యను వేధించసాగాడు.

అయితే అప్పుడే అతని బుర్రలోకి నీచపు ఆలోచన వచ్చింది. తన భార్యను అడ్డు పెట్టుకుని వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నాడు. అందుకోసం ఈ ఏడాది జూన్ నెలలో డార్లింగ్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. తన భార్య నగ్నంగా ఉన్న సమయంలో సెల్ ఫోన్ తో ఆ చిత్రాలను షూట్ చేసాడు. వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి రూ. 300 చెల్లించి ఎవరైనా డౌన్ లోడ్ చేసుకునేలా చేసాడు.

ఈ క్రమంలో గుంటూరు గాంధీనగర్ కు చెందిన బచ్చు శివశంకర్‌ ఆ చిత్రాలను కొనుగోలు చేసాడు. వంశీకాంత్ రెడ్డి స్నేహితుడు సంతోష్ కుమార్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానని కోరగా అతనికి భార్య నంబర్ ఇచ్చాడు. దీంతో సంతోష్ కుమార్ రోజూ బాధితురాలికి ఫోన్ చేసి వేధించేవాడు. అనుమానం వచ్చిన బాధితురాలు తన ఫోటోలు యూట్యూబ్ లో ఉన్న విషయాన్ని గుర్తించింది.

ఆరా తీయగా ఇదంతా చేసింది భర్తేనని గ్రహించి విస్తుపోయింది. వెంటనే గుంటూరు డిఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగిన పోలీసుల బృందం అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసారు. అతని వద్ద సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Related News