logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

ఇక జ‌గ‌న్ కోస‌మే ప‌ని చేస్తా… సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కాంగ్రెస్‌ మంత్రి

పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ మ‌ల్లాది కృష్ణారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌వ‌రి 6వ తేదీ నుంచి తాను పుదుచ్చేరి రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి వైఎస్సార్ కుటుంబానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇవాళ విజ‌య‌వాడ‌లో ఏపీ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన బీసీ సంక్రాంతి స‌భ‌కు మ‌ల్లాది కృష్ణారావు హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా మ‌ల్లాది మాట్లాడుతూ… త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు సైతం వ‌ద్ద‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పిలిస్తే ప‌లుకుతాన‌ని, త‌న‌వంతుగా సేవ చేస్తాన‌ని, ఒక వెనుక‌బ‌డిన కులానికి చెందిన వ్య‌క్తిగా వెనుక‌బ‌డిన వారి అభివృద్ధికి ప‌ని చేస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 6న త‌న‌కు పుదుచ్చేరి ప్ర‌భుత్వం స‌న్మానం ఏర్పాటు చేసింద‌ని, ఆ రోజుకు ఆ రాష్ట్ర‌ రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లుకుతాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి త‌మ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కంటే ముందు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఆహ్వానప‌త్రిక ఇచ్చేందుకు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశీస్సుల‌తో ఒక తెలుగువాడినైన తాను త‌మిళ రాష్ట్ర‌మైన పుదుచ్చేరిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడోసారి మంత్రిగా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపారు.

బీసీ కులాల‌కు పెద్ద ఎత్తున‌ ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో‌ వెనుక‌బ‌డిన కులాల వారికి నిజ‌మైన స్వాతంత్య్రం వ‌చ్చిన‌ట్లు అనిపిస్తోంద‌న్నారు. జ‌గ‌న్‌కు త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో కూడా విప‌రీత‌మైన క్రేజ్ ఉందన్నారు. జ‌గ‌న్ లాంటి ముఖ్య‌మంత్రి త‌మ‌కు కూడా ఉండాల‌ని వారు కోరుకుంటున్నార‌ని అన్నారు.

Related News