హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన వ్యక్తి సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటనకు పాల్పడ్డాడు. అండ్ భాగ్ లో ఉండే రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏఎస్సై లల్లూ సెబాస్టియన్(44) ఓ మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మైనర్ బాలికను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆనాటి నుండి పలు మార్లు బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. రెండేళ్లుగా ఈ వికృత చేష్టకు పాల్పడుతున్నాడు. ఈ నెల 6న బాలిక తలిదండ్రులు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి నిలదీయగా ఈ దారుణం వెలుగు చూసింది.
దీంతో బాలిక తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లల్లూ సెబాస్టియన్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కాగా 2017 సంవత్సరం లో నిందితుడిపై ముషీరాబాద్ పీఎస్ లో మర్డర్ కేసు కూడా నమోదైనట్టుగా పోలీసులు గుర్తించారు.