logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పది రెట్లు ప్రమాదకారిగా మారిన కరోనా.. ఇప్పుడు వాక్సిన్ వచ్చినా పని చేయదా..?

కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం నుంచి అగ్ర దేశాలు కూడా ఇంకా తేరుకోలేకపోతున్నాయి. ఈ మహమ్మారిని నివారించగల వాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఇంతలోనే కరోనాకు సంభందించిన మరో చేదు వార్త వినిపించారు మలేషియా శాస్త్రవేత్తలు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇటీవల భారత్ నుంచి మలేషియా వెళ్లిన ఓ రెస్టారెంట్ యజమాని క్వారెంటైన్ నియమాలను అతిక్రమించాడు.

దీంతో అతని ద్వారా 45 మందికి వైరస్ వ్యాపించింది. ఈ 45 మందిలో ముగ్గురికి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. ఇది ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా కన్నా10 రెట్లు ప్రమాదకారి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికి ‘డీ614జీ’ గా నామకరణం చేసారు. ఈ కొత్త వైరస్‌ వలన మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం పెరిగిందని వారు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రకాల్లో ఈ కొత్త రకం ఎక్కువ ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రయోగశాలల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ వైరస్‌కి సంక్రమణ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని అన్నారు. కోవిడ్ కారకమైన సార్స్ కోవ్ – 2 వైరస్ జన్యు క్రమంలో మార్పు జరిగిందని దీంతో ఈ కొత్త వైరస్ ఏర్పడినట్టుగా అభిప్రాయపడుతున్నారు.

ఈ కొత్త రకం కరోనా ఇదివరకే అమెరికా, ఐరోపా లో కనిపించిందని.. దీని వల్ల రెండో సారి కరోనా విజృంభించే ప్రమాదం ఉందని మలేషియా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా తెలిపారు. ఈ వైరస్ కారణంగా ఇప్పుడు కరోనా వైరస్ కోసం అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ లపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వైరస్ లు ఇలా మ్యుటేషన్ ద్వారా రూపాని మార్చుకున్నప్పుడు వాక్సిన్ లపై చేస్తున్న అధ్యయనాలు తిరిగి మొదటి దశకు రావాల్సి ఉంటుంది.

మరోసారి ఈ వైరస్ పై క్షుణ్ణంగా అధ్యయనం జరిపి వాక్సిన్ రూపొందించవల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు కరోనా వాక్సిన్ పై జరిగిన పరిశోధనలు అసంపూర్ణంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా వైరస్ లో ఇలాంటి మ్యుటేషన్లు వచ్చినప్పుడు అవి మరింత బలహీన పడటం జరుగుతుంది. కాబట్టి దీని వల్ల పెద్దగా మార్పులేమీ సంభవించకపోవచ్చనేది మలేషియా అధికారులు వాదన.

కానీ వైరస్ లో ఉన్నవి స్వల్ప మార్పులే అయినా అవి సమర్థవంతమైనవి కాబట్టి ఈ వైరస్ ఇతరులకు రెట్టింపు వేగంతో వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కొత్త రకం కరోనా వల్ల భారీ నష్టమేమీ కలుగజేయకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Related News