డిసెంబర్ 17 న నటుడు, రచయిత అడవి శేష్ పుట్టిన రోజు సందర్భగా ఈ హీరో నటిస్తున్న ‘మేజర్’ సినిమా ఫిసర్ట్ లుక్ ను విడుదల చేసారు. 26/11 2008 ముంబై ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు.
మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా ఫిసర్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తూ సంతోషం వ్యక్తం చేసారు. సినిమాలో మేజర్ ధైర్య సాహసాలనే కాకుండా అయన జీవించిన తీరు, మరిన్ని ఆసక్తికర కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
కాగా మేజర్ వీర మరణం పొందిన నాటి నుంచి ఉన్ని కృష్ణన్ గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు అడవి శేష్. ఆయన జీవితాన్ని సినిమాగా తీయగలనేనే నమ్మకం కలిగినరోజున ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నట్టుగా తెలిపాడు. కాగా ఈ సినిమాపై అడవి శేష్ గత ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నాడు.
మేజర్ ఉన్నికృష్ణన్ కుటుంబ సభ్యుల అనుమతితో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. కాగా మేజర్ సినిమా వచ్చే వేసవి కాలంలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ప్రముఖ పాత్రల్లో కలిపించగా తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల మరో కీలక పాత్రలో కనిపిస్తుంది. హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మేజర్ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు.