logo

  BREAKING NEWS

అన్న‌మ‌య్య జిల్లా పూర్తి వివ‌రాలు  |   తూర్పు గోదావ‌రి(రాజ‌మ‌హేంద్ర‌వ‌రం) జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా పూర్తి వివ‌రాలు  |   శ్రీబాలాజీ తిరుప‌తి జిల్లా పూర్తి వివ‌రాలు  |   ఎంపీ ప‌ద‌విపై క‌న్నేసిన రాజాసింగ్‌.. అక్క‌డి నుంచి పోటీ  |   షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |  

లక్షణాలు లేకపోయినా ఈ ఒక్కటీ ఉంటె కరోనా ఉన్నట్టే!

ఆయాసం.. కరోనా మహమ్మారి సోకిన వారిలో కనిపించే ప్రథమ లక్షణం. లక్షణాలు లేకుండా వైరస్ సోకిన వారిలో మినహా మిగిలిన వారిలో ఎక్కువగా ఆయాసం కనిపిస్తుంది. ఏ లక్షణమైనా బయటకు కనిపించకపోవచ్చు. కానీ కారోనా సోకితే ఆయాసం మాత్రం ఎక్కువగా ఉంటుందని ఇదివరకే ఈ వైరస్ బారిన పడినవారు చెప్తున్నారు. సాధారణంగా వచ్చే ఆయాసానికి కరోనా సోకినవారిలో కనిపించే ఆయాసానికి స్వల్ప తేడాలు ఉన్నాయి. కరోనా సోకినవారిలో జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఒంటి నొప్పులతో పాటుగా ఆయాసం కూడా ఉంటుంది. గుండెలపై ఓ వంద కేజీల బరువు ఉన్నట్టుగా అనిపించడం, గొంతులో ఏదో అడ్డు పడుతున్నట్టుగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆయాసం రావడం మనం గమనించవచ్చు.

ఎక్కువ సేపు మాట్లాడలేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం లాంటివి అనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండా ఒక ఆయాసం మాత్రమే ఉన్నా అనుమానించాల్సిందే. గడిచిన వారం రోజుల వ్యవధిలో మీరు ఎక్కడికైనా ప్రయాణించారా? లేక ఏదైనా కార్యక్రమాలలో పాల్గొన్నారా అనే విషయాన్నీ పరిశీలించుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ రోజులు ఇలా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం లేదా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఆయాసం ఎక్కువగా ఉంటే అది ప్రాణాలకే ప్రమాదం కావచ్చు.

మీకు ఆయాసం ఒక లక్షణంగా ఉండి అది కరోనానా కాదా అనే విషయం మీకు మీరే నిర్దారించుకోవాలి అనుకుంటే ఒక మూడు నిమిషాల పాటు నడవండి. ఆ తర్వాత మీకు ఆయాసం ఎక్కువగా అనిపిస్తూ ఉండి శ్వాస ఆడనట్టుగా అనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు లేకపోయినా ఆయాసం ఉన్నవారు, జ్వరం తగ్గకుండా వస్తున్నప్పుడు, విపరీతమైన దగ్గు ఉండి, రక్తంలో ఆక్సిజన్ 94 శాతం కన్నా తక్కువ ఉంటె ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

అయితే అన్ని సార్లు ఆయాసాన్ని కరోనా లక్షణంగా భావించలేము. ఇదివరకే శ్వాస సమస్యలు ఉన్నవారికి ఏ చిన్నపని చేసినా ఆయాసం వస్తుంది. కొంత మందిలో ఇతర అనారోగ్య కారణాల వల్ల కూడా ఆయాసం వస్తుంటుంది. ఇంటిని శుబ్రపరిచినప్పుడు ఆ దుమ్ము వల్ల ఆయాసం అనిపిస్తుంది. ఆయాసం రావడానికి మన ఆలోచనలు కూడా ఒక విధంగా కారణమవుతాయి.

ఎక్కువ ఉద్రేకానికి లోనైనప్పుడు కూడా ఇలా జరుగుతుంది. కొంతదూరం నడవగానే ఆయాసం అనిపించడం, ఎక్కువ శ్రమ కలిగించే పనులు చేయలేకపోవడం లాంటివి గుండె బలహీనంగా ఉందని తెలిపే సంకేతాలుగా భావించాలి. ముఖం ఉబ్బి, నిగారింపుగా మారి నడుస్తున్నప్పుడు ఆయాసంగా అనిపిస్తే అది మీలోని రక్తహీనతను సూచిస్తుంది. భోజనం తర్వాత ఈ ఆయాసం మరీ ఎక్కువగా అనిపిస్తుంటుంది. బలహీనంగా ఉన్నవారిలో కూడా ఆయాసం లక్షణం కనిపిస్తుంది. ఇలాంటి వారు ఉపవాసాలకు దూరంగా ఉండటం మంచిది.

Related News