logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

క్లాస్ రూమ్ లోనే మైనర్ బాలికకు తాళి కట్టాడు.. చివర్లో ట్విస్ట్!

క్లాస్ రూమ్ లో మైనర్ విద్యార్థులు చేసిన పని కాలేజీ యాజమాన్యంతో పాటుగా వారి తల్లిదండ్రులను షాక్ కు చేసింది. ఇంటర్ మీడియేట్ చదువుతున్న ఇద్దరు మైనర్లు తరగతి గదిలోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని జూనియర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అమ్మాయి మెడలో ఒక అబ్బాయి తాళి కట్టాడు. ఆమె నుదిటిన బొట్టుపెట్టాడు. పక్క మరికొంత మంది విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ తతంగం అంతా అక్కడున్నవారు సెల్ ఫోన్ లో రికార్డు చేసారు. ఈ విషయం కాలేజీ ప్రిన్సిపాల్ కు తెలియడంతో ఆయన వారిద్దరికీ టీసీ ఇచ్చి పంపించాడు.

ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోతుంది అనుకున్నారు. కానీ వీరిద్దరి పెళ్లిని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఈ ఇద్దరు మైనర్ల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ పెళ్లి సోషల్ మీడియాలో లైకులు కోసమే చేసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇది విన్న వారు మరింత అవాక్కవుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News