logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మైదా పిండి తింటున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!

గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి వస్తుంది. కానీ మైదా ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నిత్యం మనం తినే ఆహారంలో మైదా కలుస్తుంది. పరోటా, కేక్స్, సమోసా, జిలేబీ, బ్రెడ్స్, రోటీలు, పిండి వంటలు ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను మైదా పిండి కలిపి చేస్తారు. కానీ మైదాను తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి.

గోధుమ పిండిని పాలిష్ చేసి, వాటికి వివిధ రకాలైన రసాయనాలను కలిపి మైదా పిండిని తయారు చేస్తారు. ఇందులో క్లోరైడ్ గ్యాస్, బైంజయిల్ పెరాక్సిడ్ లాంటి రసాయనాలు కలుస్తాయి. ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల ఈ పిండి తెల్లగాను, చేతితో తాకినప్పుడు మృదువుగాను మారుతుంది.

నిజానికి చైనా తో పాటుగా యూరప్ దేశాలలో ఈ రసాయనాలపై నిషేధం విధించారు. మైదాలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే విషపూరితమైన అలొక్సానా అనే రసాయనం ఉంది. ఏవిధంగా అయితే మైదాతో చేసిన జిగురు పోస్టర్లు అతికించడానికి ఉపయోగపడుతుందో అదే విధంగా మైదాని తిన్నప్పుడు కూడా అది మన పేగుల గోడలలో పేరుకుపోతుంది. అక్కడ క్రిములు చేరి ఇన్ఫక్షన్ కు కారణమవుతాయి.

మనం తినే ఆహరం ఏదైనా అందులో తప్పనిసరిగా కొంత పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచు పదార్థం శాతం సన్నగా ఉంటుంది. అందువల్ల అది మన పేగులకు అంటుకుపోతుంది. కొన్ని సందర్భాలలో పేగుల్లో పుండ్లు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు ముదిరితే క్యాన్సర్ లాంటి వ్యాధులు మనపై దాడి చేస్తాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి.

మైదాను ఎక్కువగా తీసుకునే వారు గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఎక్కువే. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉంటుంది. అది పొట్ట దగ్గర కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది. మహిళలు ఈ పిండిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. లేదంటే రొమ్ములలో తలెత్తే అనేక రకాలైన వ్యాధులకు ఇది కారణమవుతుంది.

ఈ పిండి ద్వారా ఎలాంటి ప్రోటీన్ శరీరానికి అందదు. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే పదార్థం కావడంతో షుగర్ వ్యాధిగ్రస్తులు మైదాను తీసుకోకపోవడమే ఉత్తమం. షుగర్ లెవల్స్ ను పెంచే గుణం దీనిలో ఉంది.

Related News