logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

శ్రీమతి పుట్టినరోజు.. మహేష్ చిలిపి కామెంట్.. వైరల్!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ సతీమణి నమ్రత ఈరోజు తన 49వ పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కాగా తన సతీమణి పుట్టిన రోజు సందర్భగా ఓ చిలిపి కామెంట్ ను జత చేస్తూ మహేష్ సోషల్ మీడియా ద్వారా ఆమెపై ప్రేమను తెలియజేసాడు.

ఈరోజు నేను ప్రేమించిన అమ్మాయి పుట్టిన రోజు ఆమె నాతో ఉన్న ప్రతి రోజు నాకెంతో ముఖ్యం. ఈరోజు మరింత ప్రత్యేకం. హ్యాపీ బర్త్ డే లేడీ బాస్ అంటూ మహెష్ ట్వీట్ చేసాడు. కాగా 1993లో మిస్ ఇండియా గా గెలుపొందిన నమ్రత ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. కాగా తెలుగులో మహేష్ తో నటించిన ‘వంశీ’ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

నమ్రత మహేష్ కన్నా వయసులో పెద్దదన్న విషయం తెలిసిందే. అయితే పెద్దలను ఒప్పించి వీరిద్దరూ అత్యంత సన్నిహితుల మధ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కాగా టాలీవుడ్ లో అన్యోన్యంగా ఉండే జంటల జాబితాలో వీరి పేరు ముందు వరుసలో ఉంటుంది. కాగా మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ కూడా దుబాయిలోనే జరుగుతుంది.

Related News