logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

రేణు దేశాయ్ కి మహేష్ బాబు భారీ ఆఫర్..!

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడామె తిరిగి సినిమాల్లో నటించాలనుకుంటున్నారు. తన కోరికను ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ కు కూడా తెలిపారు. తల్లి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ లోపే ఆమెకు సూపర్ స్టార్ మహేష్ బాబు రూపంలో భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడి ప్రాణాలు అర్పించిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మహేష్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్మే పతాకంపై ‘మేజర్’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. అందులో యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాధ్యతలన్నీ మహేష్ సతీమని నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇపుడు ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం మహేష్ టీమ్ రేణు దేశాయ్ ను సంప్రదించారట.

రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ అడవి శేష్ కు పెద్ద అభిమాని దీంతో రెండు కుటుంబంతో శేష్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాక సినిమాలో ఈ పాత్ర కీలకంగా ఉంటుందట. ఈ నేపథ్యంలో శేష్ మూవీలో నటించేందుకు రేణు దేశాయ్ ఒప్పుకున్నారని సమాచారం. అయితే రేణు పాత్ర ఏమిటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

Related News