logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

స్టార్ హీరోల ఫాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సినిమా.. క్షమాపణలు చెప్పాలంటూ..

విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను తట్టి లేపిన దర్శకుడు వెంకటేష్ మహా. వీరిద్దరూ కలిసి తీసిన సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ సినిమా నిన్న ఓటిటీ లో విడుదలై మంచి సినిమాగా టాక్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా టీమ్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

సత్యదేవ్ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా దర్శకుడు వెంకటేష్ మహా, హీరో సత్యదేవ్ మహేష్ కు క్షమాపణలు చెప్పాలని ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక మహేష్ అభిమానులకు ఇంతలా కోపం తెప్పించే విధంగా ఈ సినిమాలో ఏం ఉందంటే.. ఈ సినిమాలో యువ నటుడు సుహాస్ కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

సుహాస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా కనిపిస్తాడు. అతను ప్రేమించే అమ్మాయి మహేష్ అభిమాని. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని డైలాగుల్లో ఓ నేపథ్యంలో ‘మహేష్ బాబు లేజీ.. ఉన్న చోట నుండి కదలకుండా విలన్లను చంపుతాడు… అదే ఎన్టీఆర్ క్రేజీ విలన్లను పెరిగెత్తించి మరీ చంపుతాడు’ అంటూ ఒక సన్నివేశం ఉంటుంది. ఈ వీరిద్దరి మధ్య సీన్లను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.

కానీ మహేష్ అభిమానులకు మాత్రం కోపం తెప్పించింది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై రచ్చ నడుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా దీనిపై స్పందించడంతో ఇప్పుడు ఈ కాంట్రవర్సీ మరింత ముందుకెళ్లింది. మరి ఈ వివాదానికి సినిమా టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News