logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలో మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గీతగోవిందం’ ఫేమ్ పరుశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కీర్తి సురేష్ మొదటిసారిగా మహేష్ బాబుతో జోడి కట్టనుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే సినిమాపై కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసందే. అయితే తాజాగా ఈ స్టార్ హీరోకు సంబందించిన ఓ రూమర్ వినిపిస్తుంది. గతంలో నాగశౌర్యతో ఛలో సినిమా టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు వెంకీ కుడుముల మెగా హీరో రామ్ చరణ్ కోసం ఓ కథ రాసాడట.

ఆ కథను చెర్రీకి వినిపిస్తే అందులో తన పాత్ర నచ్చలేదన్న కారణంతో ఈ సినిమాకు నో చెప్పాడట. అయితే ఇదే కథను మహేష్ బాబుకు వినిపించగా ఈ కథపై మహేష్ ఆసక్తి చూపించాడని త్వరలోనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడని సమాచారం. కాగా ఇప్పటికే నితిన్ తో ‘భీష్మ’ తీసి హిట్టుకొట్టిన వెంకీ కుడుముల ఈసారి ఏకంగా మహెష్ నే డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Related News