logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

‘జాతిరత్నం’పై మహేష్ ఫోకస్.. త్వరలోనే సినిమా!

గతంలో వచ్చి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు ‘జాతిరత్నాలు’ సినిమాతో సందడి చేస్తున్నాడు. ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ గా టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో నవ్వులు పోయిస్తుంది. దీంతో ఇపుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీ అవుతున్నాడు నవీన్. ఈ క్రమంలోనే అనుష్కతో ఓ సినిమాలో నటిస్తున్నాడని టాక్ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇదిలా ఉంటె ఈ యంగ్ హీరోపై ఓ స్టార్ హీరో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఓవైపు యాడ్స్, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సొంత ప్రొడక్షన్ ను స్థాపించి బిజినెస్ మ్యాన్ గా మారాడు మహేష్. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ పనులన్నీ నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు. ఘట్టమనేని మహేష్ బాబు ప్రొడక్షన్స్ లో వస్తున్న మొదటి సినిమా ‘మేజర్’. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 2008 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

అయితే ఇప్పుడు తన ప్రొడక్షన్ లో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేయనున్నాడు మహేష్. చలో, భీష్మ సినిమా హిట్లతో జోరుమీదున్న దర్శకుడు వెంకీ కుడుముల కథలో నవీన్ పోలిశెట్టిని హీరోగా పెట్టి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అయితే వెంకీ కుడుముల మహేష్ బాబు కోసం ఓ కథను సిద్ధం చేసాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి సినిమాకన్నా ముందుగానే నవీన్ పోలిశెట్టి సినిమాను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలతో పాటుగా విజయ్ దేవరకొండ హీరోగా మహేష్ ఓ సినిమాను నిర్మయించనున్నాడు. ప్రస్తుతం పూరి డైరెక్షన్లో వస్తున్న ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ ఆ సినిమా పూర్తవగానే మహేష్ సినిమా కోసం పని పని చేయనున్నాడు. ఏది ఏమైనా సొంత ప్రొడక్షన్ ద్వారా యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నాడు మహేష్ బాబు.

Related News