టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసారు. లాక్ డౌన్ సమయంలో కొంత మేరకు నియంత్ర ఉన్నా తాజాగా సడలింపులు ఇచ్చిన తర్వాతనే కేసుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. ఈ సమయంలో మన వంతు బాధ్యతగా మనల్ని మనం కాపాడుకుంటూ మన చుట్టూ ఉన్న వారిని కూడా కాపాడుకోవాలని అయన మరొక్కసారి పిలుపునిచ్చారు.
తాజగా మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేస్తూ.. ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ ను ఉపయోగించాలని కోరారు. ఇప్పటివరకు ఎవరైనా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని తెలిపారు. మన చుట్టు పక్కల నమోదయ్యే కరోనా కేసులను సూచిస్తూ ఈ యాప్ మనల్ని అప్రమత్తంగా ఉంచుతుందన్నారు. అంతేకాదు అత్యవసర వైద్య సదుపాయాలను కూడా యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలని మహేష్ బాబు విజ్ఞప్తి చేసారు.