బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదంగా మారింది. నిన్నబాంద్రా లోని తన ఫ్లాట్ లో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆయనకు సంబందించిన సమాచారం, చిన్ననాటి ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఫోటోలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సుశాంత్ ఫోటోలు అత్యంత బాధాకరంగా కలిచి వేసేవిధంగా ఉండటంతో దీనిపై మహారాష్ట్ర పోలీసులు స్పందించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతదేహానికి సంబందించిన ఫోటోలను ఇలా షేర్ చేయడం చట్టరీత్యా నేరం. వెంటనే వాటిని తొలగించకుంటే వారిపై చర్యలు తీసుకుంటాం అని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. దీంతో ఇప్పటికే సుశాంత్ సూసైడ్ ఫోటోలను షేర్ చేసిన వారు వాటిని తొలగిస్తున్నారు.