logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

భర్త ఫిర్యాదు.. మహిళ పట్ల గ్రామస్తుల పైశాచికత్వం

శాస్త్ర, సాంకేతిక పరంగా దేశం ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని మారుమూల ప్రాంతాల్లో మహిళలపై ఇంకా అనాగరిక చర్యలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. అందులోనూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే మహిళల పట్ల జరిగే దారుణాలు అన్ని ఇన్ని కావు. ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ యువతిని కన్న తలిదండ్రులు, గ్రామస్తులు కలిసి అర్థనగ్నంగా ఊరేగించిన ఘటన మరువక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది.

జబువా జిల్లాలోని ఓ గిరిజ‌న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్యతో కలిసి కొన్నేళ్ల కిందట గుజరాత్ కు వలస వెళ్ళాడు. ఇటీవల కరోనా కారణంగా తిరిగి సొంతూరికి చేరుకున్నాడు. కాగా ఇటీవల తన భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని కుటుంబానికి చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని వారు గ్రామ పెద్దలకు చెప్పడంతో ఆ మహిళను పంచాయతీలో నిలబెట్టారు.

కేవలం భర్త చేసిన ఆరోపణలను నమ్మి ఆ మహిళకు దారుణమైన శిక్షను విధించారు. భర్తను భుజాలపై మోసుకుని ఊరంతా తిప్పాలని ఆమెకు శిక్ష విధించారు. ఊరి పెద్దల తీర్పును వ్యతిరేకించే ధైర్యం చేయలేని ఆ మహిళ భర్తను భుజాలపై మోసింది. అతని బరువు మోయలేక కాళ్ళు తడబడుతుంటే మరోవైపు వెనక నుంచి కొందరు వ్యక్తులు ఆమెను కర్రలతో చావబాదారు.

అసభ్యకరమైన మాటలు తిడుతూ పైశాచికత్వం ప్రదర్శించారు. ఈ దుర్మార్గాన్ని అక్కడున్న ఎవ్వరు ఆపే ప్రయత్నం చేయకపోగా కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అది వైరల్ గా మారి పోలీసుల దృష్టికి వెళ్లడంతో మహిళ భర్తతో సహా మరో ఏడుగురు గ్రామస్తులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Related News