మన చేతి గోర్లపై అప్పుడప్పుడు కొన్ని గుర్తులు ఏర్పడటం, రంగుమారడం వంటివి గమనించే ఉంటాం. కానీ ఇలా ఎందుకు జరుగుతుందని మాత్రం తెలుసుకుని ఉండరు. మన శరీరంలో జుట్టు లాగే గోర్లు కూడా కెరోటిన్ అనే ప్రోటీన్ కారణంగా ఏర్పడతాయి. గోర్లను చూసి వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్యలను అంచనా వేస్తుంటారు వైద్యులు. అలాగని ఏ ఇద్దరు వ్యక్తుల గోర్లు ఒకేలా ఉండవు.
గోర్లపై ఒక్కోసారి తెల్లటి ఆకారంలో కొన్ని గుర్తులు ఏర్పడటం దాదాపు అందరికీ జరిగే ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఉండే ఈ గుర్తులు కొన్ని సార్లు తెలుపు రంగులో మరికొన్ని సార్లు నీలి రంగు, పసుపు రంగులో కనిపిస్తాయి. అయితే ఇలాంటి మచ్చలు, గుర్తులు కనిపిస్తే వీటిని నిర్లక్ష్యం చేయవద్దని అంటున్నారు వైద్యులు. చేతి లేదా కాలి గోర్లపై తెల్లటి ఆకారంలో ఏర్పడే వీటిని ‘లూనులా’ అంటారు. ఈ మచ్చలు కొన్ని ఆరోగ్యాన్ని సూచిస్తే మరి కొన్ని అనారోగ్యాన్ని తెలియజేసేసవి ఉంటాయి.
ఇవి చేతిపై కనిపిస్తే.. వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపే సూచన. థైరాయిడ్ గ్రంథి, జీర్ణ క్రియ సరిగా పనిచేస్తున్నాయని అర్థం. ఒకవేళ చిన్న, తెల్లటి పరిణామంలో ఈ గుర్తులు కనిపిస్తే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని, జుట్టు రాలడం, రక్త హీనత వంటి సమస్యలు ఉన్నాయని అర్థం. చేతిపై ఇలాంటివే పెద్ద సైజులో మచ్చలు 8 నెలల కన్నా ఎక్కువ కాలం కనిపించకపోతే విటమిన్ A లోపంతో బాధపడుతున్నారని, ప్రోటీన్ లు శరీరానికి అందడం లేదని తెలిపే సంకేతంగా భావించాలి.
అలాగే రక్తప్రసరణ లేకపోతే కూడా ఇలాంటి మచ్చలు కనిపించవు. జింక్, ఐరన్ లోపం కలిగి ఉన్నప్పుడు ఈ తెల్ల మచ్చలు కనిపించి కనిపించనట్లుగా ఉండి వస్తూ పొతూ ఉంటాయి. కాలేయ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటె గోర్లు పసుపు రంగులోకి మారతాయని గుర్తించాలి. ఇలాంటి మార్పులు తీవ్రంగా ఉంటె ఒకసారి వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.