logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

యంగ్ ఐఏఎస్‌ అమ్రాపాలికి ల‌క్కీ ఛాన్స్‌..!

ఐఏఎస్ అధికారి అమ్రాపాలికి ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఏకంగా ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యంలో డిప్యూటీ సెక్ర‌ట‌రీగా అమ్రాపాలి నియ‌మితుల‌య్యారు. తాజాగా ప్ర‌ధాని కార్యాల‌యంలో నియ‌మిత‌లైన ముగ్గురు ఐఏఎస్ అధికారుల్లో అమ్రాపాలి ఒక‌రు. ఆమె 2023 అక్టోబ‌రు 27వ వ‌ర‌కు పీఎంవోలో డిప్యూటీ సెక్ర‌ట‌రీ హోదాలో విధులు నిర్వ‌హించ‌నున్నారు.

2010 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారిని అయిన అమ్రాపాలి త‌క్కువ కాలంలోనే విధి నిర్వ‌హ‌ణ‌లో స‌మ‌ర్థురాలిగా పేరు తెచ్చుకున్నారు. మొద‌ట ఆమె వికారాబాద్ స‌బ్ క‌లెక్ట‌ర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా కొంత‌కాలం పాటు పని చేశారు. తెలంగాణ‌లో జిల్లాల పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత ఆమెను వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా తెలంగాణ ప్ర‌భుత్వం నియ‌మించింది.

ఆ త‌ర్వాత ఆమె ఎన్నిక‌ల సంఘంలో విధులు నిర్వ‌ర్తించారు. ఏడాదిన్న‌ర క్రితం ఆమె కేంద్ర స‌ర్వీసుల్లోకి వెళ్లారు. ఇప్పుడు ఆమెకు పీఎంవోలో ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కింది. అమ్రాపాలి కాటా స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా. ఆమె తండ్రి కాటా వెంక‌ట్‌రెడ్డి ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు.

Related News