అదృష్టం ఎవరికి, ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. ట్యాలెంట్ ఉంటే కచ్చితంగా ఏదో రకంగా అవకాశాలు లభిస్తాయి. ఇందుకు ఉదాహరణ బిగ్ బాస్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. యాంకర్‌గా చిన్న చిన్న షోలు చేస్తూ యూట్యూబ్‌లో అప్పుడప్పుడు కనిపించే ఆరియా ఇప్పుడు వరుసగా సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది. తాజాగా ఆరియానాకు మెగా హీరో సినిమాలో నటించేందుకు బంపర్ ఆఫర్ లభించింది. దీంతో పాప ఫుల్ ఖుషీగా ఉంది.
సరిగ్గా ఆరు నెలల క్రితం ఆరియానా గ్లోరీ యూట్యూబ్ ఛానెల్లో యాంకర్‌గా పని చేసేది. ఓసారి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఈ అమ్మడు దశ తిరిగిపోయింది. ఈ ఇంటర్వ్యూలో ఆరియానాను రామ్‌గోపాల్ వర్మ పొగడటం పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దీంతో ఆరియానా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇది చూసిన స్టార్ మా నిర్వహాకులు ఆరియానాకు బిగ్ బాస్‌లో ఛాన్స్ ఇచ్చారు.
బిగ్ బాస్‌లో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టంట్ ఆరియానా. ఆమె షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమెపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, తన ముక్కుసూటితనంతో ఫైనల్ చేరింది ఆరియానా. షో గెలవకపోయినా చాలామంది హృదయాలను గెలుచుకుంది. దీంతో ఇప్పుడు ఆరియానాకు వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పటికే యంగ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి ఒక సినిమాలో ఆరియానా గ్లోరీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పైన ఉంది. ఇప్పుడు ఏకంగా మెగా హీరో సినిమాలో ఆరియానాకు ఛాన్స్ వచ్చింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా శ్రధర్ సీపన అనే దర్శకుడు ఒక సినిమా తీస్తున్నాడు. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమాలో హీరో కళ్యాణ్ దేవ్ చెల్లి పాత్ర కోసం ఆరియానాను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసింది. దీంతో త్వరలోనే కళ్యాణ్ దేవ్ చెల్లి పాత్రలో ఆరియానా కనిపించనుంది. హీరోయిన్ రోల్ కాకపోయినా ఆరియానా ఓకే చెప్పింది. త్వరలోనే ఆరియానా గ్లోరీకి హీరోయిన్గా కూడా మంచి అవకాశాలు దక్కి ఇంకా మంచి స్థానంలోకి వెళ్లాలని మనమూ కోరుకుందాం.