logo

  BREAKING NEWS

భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. నేటి నుండే అమలు

గత మూడు నెలలుగా లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న మధ్య తరగతి ప్రజలకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు హడలెత్తిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కంపెనీలు తీసుకున్నఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై మరింత భారం పడనుంది. పెరిగిన ధరలు నేటి నుండే అమలులోకి రానున్నాయి. దీంతో సిలిండర్ బుక్ చేసుకునే వారికి పెరిగిన గ్యాస్ ధరలు షాకిస్తున్నాయి.

ఢిల్లీలో 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.11.5 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కు చేరింది. అదేవిధంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.110 కు పెరగడంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కు చేరింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి మారకం విలువ ను ఆధారం చేసుకుని ప్రతి నెల ఎల్ పీజీ ధరలను సవరిస్తారు.

అంతర్జాతీయంగా ఇంధనం ధరలు తగ్గిన నేపథ్యంలో మే నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు రూ.744 నుంచి రూ.581 తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ధరలు పెరగడంతో గ్యాస్ కంపెనీలు కూడా ధరలను పెంచి విక్రయిస్తున్నాయి. అయితే ఈ పెంపు ప్రధాన మంత్రి ఉజ్వల స్కీమ్ (PMUY) లబ్ది దారులకు వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది.

Related News