logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!

మౌత్ వాష్ ను వాడటం వలన కరోనా ముప్పు తగ్గుతున్న విషయం గతేడాదే పరిశోధకులు వెల్లడించారు. ఇప్పుడు కరోనా తీవ్రత దృష్ట్యా మౌత్ వాష్ ల వాడకం మరోసారి తప్పనిసరిగా మారనుంది. జర్నల్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ లో తాజాగా ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మనకు అత్యంత చవకగా లభించే మౌత్ వాష్ లు కరోనాను నోట్లోనే అడ్డుకుని శరీరం తద్వారా ఊపిరితిత్తుల్లోకి వైరస్ వ్యాపించకుండా చేస్తాయని పేర్కొంది.

దీంతో కరోనా వైరస్ నోటిలోనే అంతమవుతుందని, ఊపిరితిత్తుల్లోకి వ్యాప్తి చెందలేదని తేలింది. నోరు శుభ్రంగా లేకపోవడం, చిగుళ్ల వాపు వంటివి కరోనా తీవ్రతను మరింత పెంచుతున్నాయని పరిశోధనలో వెల్లడైంది. చిగుళ్ల నుంచి వచ్చే రక్తంతో పాటుగా వైరస్ చేరితే అది శరీరంలోని రక్త నాళాలలోకి సులభంగా ప్రవేశిస్తుంది. అప్పుడు చాలా తక్కువ సమయంలోనే ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. అందుకే చిగుళ్ల వ్యాధితో బాధపడేవారితో సహా ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒకసారైనా డెంటిస్ట్ ను సంప్రదించి పళ్ళు శుభ్రం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మౌత్ వాష్ లాంటి ఉత్పత్తులు కరోనా వైరస్ ను బలహీనపరచడంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయని తేలింది. 10 సెకండ్లపాటు మౌత్ వాష్ ను వాడడం వల్ల లాలాజలంలోని వైరల్‌ లోడ్‌ గణనీయంగా తగ్గుతుందని, తద్వారా వైరస్‌ సోకే ప్రమాదం కూడా తగ్గుతుందని తెలిపారు. ఎనిమిది నెలల పరిశోధనల అనంతరం ఈ విషయాలని నిర్దారించారు.

Related News