logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

సడెన్ గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలి? లక్షణాలు ఎలా ఉంటాయి?

మనలో చాలా మంది లో బీపీ సమస్యతో బాధపడతారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి బీపీ 120/80 గా ఉంటుంది. ఇది ఏ మాత్రం తగ్గినా దాన్ని లో బీపీగా పరిగణిస్తారు. కూర్చొని ఒక్కసారిగా లేచినప్పుడు కళ్లు బైర్లు కమ్మడం, స్పృహ తప్పడం లాంటివి లో-బీపీ లక్షణాలు. కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం, కొద్దిపాటి పనికే అలసిపోయినట్లు అనిపిస్తే బీపీ తక్కువగా ఉందని భావించొచ్చు. బీపీ తగ్గడం వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. అందువల్లే కళ్లు తిరగడం అనే సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి సడెన్ గా బీపీ డౌన్ అయిపోవడం వల్ల స్పృహ తప్పినట్లుగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఏం చేయాలి? వెంటనే బీపీని సాధారణ స్థితికి తెచ్చే కొన్ని చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా బీపీ తగ్గినప్పుడు తల తిరిగుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖం, కాళ్ళు, చేతులు వణుకుతుంటాయి. ఇవన్నీ లో బీపీ లక్షణాలని కూడా చాలా మందికి తెలియదు. ఇలా జరిగినప్పుడు వెంటనే ఎలక్ట్రోలైట్ ద్రావణం లేదా చక్కెర, ఉప్పు కలిపిన నీటిని తీసుకోవాలి. నిమ్మరసం తాగినా ఈ సమయంలో పరిస్థితిని మెరుగు పడేందుకు సహాయపడుతుంది. ఇవేవీ అందుబాటులో లేకపోతే ఆ వ్యక్తికి కప్పు కాఫీ తాగించినా సరిపోతుంది. అందుబాటులో ఉన్న ఏదైనా తీపి పదార్థం తినిపించినా వెంటనే బీపీ అదుపులోకి వస్తుంది.

అయితే లో బీపీ సమస్య నుంచి పూర్తిగా బయటపడటానికి మందుల కన్నా సరైన డైట్ ను పాటించడమే సరైన పద్దతని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. ఎక్కువ మోతాదులో ఆహారాన్ని ఒకేసారి తీసుకోవడం కూడా మంచిది కాదు. పొట్ట నిండుగా ఉన్నప్పుడు కూడా బీపీ తగ్గుతుంది. మనం తీసుకునే ఆహారంలో అన్నిపోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. అరటి పండ్లు, నట్స్, బొప్పాయి, ముల్లంగి, పాలకూర వంటివి లో బీపీ సమస్య తలెత్తకుండా చేసే ఆహార పదార్థాలే. అలాగే వేపుడు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే త్వరగా జీర్ణం కాదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని, రోజులో ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి.

ప్రతి రోజు అరగంట సేపు వ్యాయామం లేదా వాకింగ్ చేయాలి. శరీరం డీ హెడ్రేట్ అయినప్పుడు రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అందుకే రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు లో బీపీ సమస్య ఉన్న వారికి తలా తిరగడం, గుండె దడగా అనిపించడం వంటివి ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒకేసారి వేగంగా కదలకుండా నెమ్మదిగా శరీరాన్ని కదిలించాలి. కళ్ళుతిరుగుతున్నట్టుగా అనిపిస్తే ఒకే చోట కదలకుండా కూర్చోవడం వలన వెంటనే తగ్గిపోతుంది. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా మెడిటేషన్ ను అలవాటు చేసుకుంటే బీపీ సమస్యలను తగ్గించడమే కాకుండా రోజంతా యాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి బీపీ ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది.

Related News