logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్రేమికుల ఆత్మహత్య.. వాట్సాప్ చాట్ లో సంచలన విషయాలు

ప్రేమికుల ఆత్మహత్య రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ప్రేయసి ఆత్మహత్య ప్రియుడు కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్ పెళ్లికి చెందిన సుకన్య(20), ఐలాపూర్ కు చెందిన ప్రేమ్ కుమార్(22) లు స్థానిక డిగ్రీ కాలేజీలో చదువు పూర్తిచేశారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమిచుకుంటున్నారు.

ఇటీవల ఈ విషయం సుకన్య ఇంట్లో తెలియడంతో వారు కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వారం రోజులుగా ఆమె ఇంట్లో పెళ్లి చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సుకన్య ప్రియుడికి చెప్పింది. వాట్సాప్ చాటింగ్ లో తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే జీవితంలో స్థిరపడకుండా ఇప్పుడప్పుడే పెళ్లి వద్దని ప్రేమ్ కుమార్ సుకన్యను వారించాడు.

దీంతో మనస్థాపానికి గురైన సుకన్య ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వార్త విన్న ప్రేమ్ కుమార్ ప్రేయసి మరణాన్ని తట్టుకోలేక తన గ్రామంలోనే ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సుకన్య వాట్సాప్ చాట్ ను పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసింది. కాగా సుకన్య తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు కాగా కుటుంబ కారణాల వల్ల ఆమె సోదరి గతంలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ్ కుమార్ ఇంట అతని అన్న భార్యకు సీమంతం వేడుక నిర్వహిస్తుండగానే అతని చావు వార్త విన్న కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Related News