logo

  BREAKING NEWS

ఓయో లాడ్జిలో రూమ్ బుక్ చేసుకుని అఘాయిత్యం.. యువతి మృతి!

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓయో లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పొలిసు స్టేషన్ పరిధిలో ఓయో లాడ్జిలో ఒక యువ జంట గదిని అద్దెకు తీసుకున్నారు.

వీరు లోపలికి వెళ్లిన కొంతసేపటి తర్వాత ఆ గది నుండి పురుగుల మందు వాసన రావడంతో లాడ్జి సిబ్బంది యజమానులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి చూడగా యువతీయువకులు విగత జీవులుగా పడి ఉన్నారు. వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యలు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మరణించగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

వీరిద్దరి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేక ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడా అనే కోణంలో పోలీసులు దర్యప్తు చేపట్టారు. కాగా సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా పరిశీలిస్తున్నారు.

Related News