logo

ప్రేమికుల రాసలీలలు చూశాడని.. బాలుడి దారుణ హత్య!

ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో చూసాడన్న కారణంగా ఓ యువకుడు 8 ఏళ్ల బాలుడిని దారుణంగా హతమార్చాడు. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా ఊత్తుకులి సమీపంలోని సొట్టకవుండమ్‌పాలయం సమీప ప్రాంతానికి చెందిన తంగరాజ్‌- సుమతి దంపతుల రెండో కుమారుడు పవనేశ్. వీరి ఇంటి పక్కనే ఉండే ఇంట్లో ఓ యువతి పాలిటెక్నీక్ చదివే యువకుడితో కొంత కాలంగా ప్రేమలో ఉంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు యువతి ప్రేమికుడు ఆమెని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం వీరిద్దరూ చెరువు గట్టుపైన ఉన్న పొదల్లో ఏకాంతంగా గడపసాగారు. అదే సమయంలో అటుగా వెళుతున్న పవనేశ్ వీరిని చూసాడు. పవనేశ్ యువతి విషయాన్ని ఇంట్లో చెబితే వారి ప్రేమ విషయం అందరికీ తెలిసిపోతుందని భయంతో ఆ యువకుడు పవనేశ్ ను హత్య చేయాలనుకున్నాడు.

బాలుడిని ఎత్తుకెళ్ళి హత్య చేసి చెరువు పక్కన పొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం పనుల నుంచి ఇంటికి వచ్చిన బాలుడి తల్లితండ్రులు కుమారుడి ఆచూకీ కోసం ఊరంతా గాలించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిస్టరీగా మారిన బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ఏడు స్పెష టీమ్స్ ను రంగంలోకి దింపాయి.

చివరకు బాలుడి ఇంటి పక్కనున్న యువతి పై అనుమానం వచ్చి ఆమె ప్రేమికుడే హంతకుడని తేల్చారు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం బాలుడి శవాన్ని చెరువు పక్కనే ఉన్న పొదల్లో స్వాధీనం చేసుకున్నారు. బాలుడి కడుపు, గొంతులో కత్తితో పొడిచిన గాయాలను గుర్తించారు. 8 ఏళ్ళ బాలుడిని ఇంత కిరాతంగా హత్య చేయడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News