logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

చెత్త‌కుండీలోని లాట‌రీ టిక్కెట్‌కు 7 కోట్లు.. భార‌తీయుడి నిజాయితీకి అమెరికా ఫిదా

తినే ప్ర‌తీ గింజ మీద పేరు రాసి ఉంటుంద‌ని పెద్ద‌లు అంటారు. అమెరికాలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న ఇదే నిజ‌మే అనేలా ఉంది. ఒక మ‌హిళ ఎంతో ఆశ‌తో ఒక లాట‌రీ టిక్కెట్‌ను కొనుక్కుంది. పొర‌పాటున త‌న టిక్కెట్‌కు లాట‌రీ ద‌క్క‌లేద‌ని భావించిన ఆ మ‌హిళ లాట‌రీ టిక్కెట్‌ను ఒక షాప్‌లోని డ‌స్ట్ బిన్‌లో ప‌డేసింది. అయితే, ఆమె ప‌డేసిన లాట‌రీ టిక్కెట్ మిలియ‌న్ డాల‌ర్ల‌ను గెలుచుకుంది. అంటే, మ‌న భార‌తీయ క‌రెన్సీలో దాదాపుగా ఏడు కోట్ల 27 ల‌క్ష‌లు.

నిజానికి, ఆ లాట‌రీ టిక్కెట్ చెత్త‌కుప్ప‌లోకి చేరాలి. కానీ, లాట‌రీ టిక్కెట్ ప‌డేసిన షాపు ఒక భార‌తీయుడిది. మ‌హిళ లాట‌రీని ప‌డేసిన ప‌ది రోజుల‌కు షాపు నిర్వ‌హించే భార‌తీయుడు అభి షా చూశాడు. ఆ లాట‌రీ టిక్కెట్‌ను పూర్తిగా స్క్రాచ్ చేయ‌లేద‌ని గ‌మ‌నించాడు. అభి ఆ టిక్కెట్ తీసుకొని పూర్తిగా స్క్రాచ్ చేసి చూడ‌గా మిలియ‌న్ డాలర్లు గెలిచిన‌ట్లు ఉంది. దీంతో షాక్ తిన్న అభి తాము కోటీశ్వ‌రులం అయ్యాం అనుకున్నాడు. ఖ‌రీదైన టెస్లా కారు కొనాల‌ని క‌ల క‌న్నాడు.

ఇదే విష‌యాన్ని ఇండియాలో ఉండే త‌న తాత‌, నాన్న‌మ్మ‌కు ఫోన్ చేసి చెప్పాడు. అయితే, ప‌రాయివారి సొమ్ము మ‌న‌కు వ‌ద్ద‌ని వారు న‌చ్చ‌జెప్పారు. ఆ టిక్కెట్ ఎవ‌రు కొన్నారో వాళ్ల‌కే ఇచ్చేయాల‌ని మ‌న‌వ‌డికి సూచించారు. దీంతో అభి షా మ‌న‌స్సు మారింది. ఆ లాట‌రీ టిక్కెట్ కొన్న మ‌హిళ త‌మ షాపుకు వ‌చ్చే రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్‌. వెంట‌నే ఆమెను పిలిచి ఈ విష‌యాన్ని చెప్పి, ఆమె టిక్కెట్ ఆమెకు ఇచ్చేశారు.

ముందు ఆ మ‌హిళ ఈ విష‌యాన్ని న‌మ్మ‌లేదు. ఆ త‌ర్వాత మెల్లిగా తేరుకుంది. అభి నిజాయితీ చూసి ఆనందబాష్పాలు కార్చింది. ఇంత నిజాయితీగా ఏడు కోట్లు ఇచ్చేయ‌డం ఆమెకు షాక్ క‌లిగించింది. ఈ విష‌యం ఆ నోటా, ఈ నోటా అమెరికా అంతా పాకింది. భార‌తీయుడి నిజాయితీకి అమెరిక‌న్లు ఫిదా అవుతున్నారు. అమెరికా మీడియా ఆయ‌న‌తో ఇంట‌ర్వ్యూలు చేస్తోంది. ప్ర‌తీరోజూ అభిని అభినందిస్తూ అనేక ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి.

అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రంలోని సౌత్‌విక్ ప‌ట్ట‌ణంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అన్న‌ట్లుగా ఈ షాపు పేరు ల‌క్కీ స్టాప్‌. పేరుకు త‌గ్గ‌ట్లుగానే ఈ షాపులో లాట‌రీ టిక్కెట్ కొన్న మ‌హిళ నిజంగానే ల‌క్కీ లేడీ అయ్యింది. తొంద‌రుపాటులో లాట‌రీ టిక్కెట్ పూర్తి స్క్రాచ్ చేయ‌క‌పోయినా, డ‌స్ట్ బిన్‌లో ప‌డేసి ప‌ది రోజులైన త‌ర్వాత కూడా మ‌హిళ‌కు లాటరీ వ‌రించింది అంటే ఆమెకు ఆ లాట‌రీ ద‌క్కాల‌ని నిజంగానే భ‌గ‌వంతుడు రాసి పెట్టాడేమో.

Related News
%d bloggers like this: