logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

సహాయం కోసం 12 గంటల నిరీక్షణ.. చివరి నిమిషంలో తాడు తెగడంతో..

సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వపూర్ వద్ద మోతె వాగులో గల్లంతయిన లారీ డ్రైవర్ శంకర్ ప్రాణాలు వదిలాడు. 12 గంటల పాటు వరద నీటిలో చెట్టు కొమ్మను పట్టుకుని నరక యాతన అనుభవించాడు. అతన్ని కాపాడేందుకు పోలీస్ కమిషనర్, జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డ్రైవర్ ను కాపాడాలని మంత్రి హరీష్ రావు ఇచ్చిన ఆదేశాలతో హెలికాఫ్టర్ ను సైతం రంగంలోకి దించారు.

అయితే ఉదయం 8 గంటలకు రావలసిన హెలికాఫ్టర్ ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రావడం ఆలస్యం కావడంతో 11 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకుంది. అప్పటికే హైదరాబాద్, వరంగల్‌ నుంచి రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లను రప్పించారు. డ్రైవర్‌ శంకర్‌ వద్దకు తాడు సహాయంతో ట్యూబ్‌ను వదిలారు. ట్యూబు మధ్యలో వరకు చేరుకునేసరికి అతని షర్టుకు ముళ్ల కంప తగిలింది. అప్పటికే వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఆఖరి నిమిషంలో తాడు తెగి చెట్టుతో సహా డ్రైవర్ శంకర్ వరద నీటిలో కొట్టుకుపోయాడు.

హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు శంకర్ మృతి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. శంకర్ మరణ వార్తతో అతని స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లాలోని కాశిరెడ్డి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోహెడ మండలంలోని మోతె వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు ఇసుక లారీ లోడ్ వెళ్తుంది.

వాగుపై ఉన్న వంతెన పై నుంచి మొత్తం 8 లారీలు వెళ్ళవలసి ఉండగా.. మొదటి 4 లారీలు వంతెన దాటాయి. 5వ లారీ వంతెనపైకి వచ్చే సమయానికి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో లారీ కొట్టుకుపోయింది. అందులో ఉన్న క్లీనర్ ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి లారీ లోనుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. వెంటనే 100 కు డయల్ చేసి సమాచారం అందించాడు.

డ్రైవర్ శంకర్ మాత్రం లారీతో సహా వరదలో కొట్టుకుపోయాడు. సుమారు 12 గంటలపాటు ఓ చెట్టుకొమ్మను ఆసరాగా చేసుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు. అతన్ని కాపాడటానికి వచ్చిన రెస్క్యూ టీమ్ ద్వారా కొద్దీ సెకండ్లలో బయటకు రావలసి ఉండగా ఆఖరి క్షణాల్లో తాడు తెగి ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన విషాదంగా మారింది.

Related News