logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

చైనా డ్రాగన్ పై రామబాణం.. భారత్ కు హంకాంగ్, తైవాన్ సపోర్ట్..!

భారత్-చైనా సైన్యాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ పోరులో సుమారు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘర్షణల్లో చైనా కు కూడా భారీ నష్టమే వాటిల్లిందని వార్తలు వస్తున్నాయి. చైనాకు చెందిన 43 మంది సైనికులు తీవ్రంగా గాయపడగా, అందులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తుంది. చైనా భారత సైనికులను వ్యూహాత్మకంగానే ఉచ్చులోకి దింపిందని భారత సైన్యాధికారులు అనూమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా భారత సైనికులు ఈ దాడిని ప్రతిఘటించగలిగారని ఫలితంగా చైనాకు భారీ నష్టం వాటిల్లిందని చెప్తున్నారు.

డ్రాగన్ తీరుపై భారత ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ – వాట్సాప్ తో పాటు వివిధ మార్గాల్లో భారతీయులు తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. ఈ దాడుల నేపథ్యంలో హంకాంగ్ తమ సోషల్ మీడియా వేదిక లో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు ధనుర్బాణాన్ని చైనా డ్రాగన్ పైకి ఎక్కుపెట్టినట్లుగా ఉన్నఫోటోను సంఘీభావంగా పోస్ట్ చేశారు. ‘మేము జయించాము, మేము చంపాము’ అని రాసి ఉన్న ఈ అద్భుతమైన ఫోటోను తైవాన్ మీడియా ఆర్గనైజేషన్ సైతం ప్రశంసించింది.

తన కథనంలో చైనా డ్రాగన్ పై రాముడు విల్లు ఎక్కు పెట్టినట్టుగా ఉన్న ఆ ఫోటోను ‘ఫోటో ఆఫ్ ధీ డే’ గా ప్రచురించింది. భారత సైనికుల ధైర్య సాహసాలను కీర్తిస్తూ.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడాలని ప్రయత్నించిన చైనాకు చుక్కలు చూపించారని పేర్కొంది. తైవాన్, హంగ్ కాంగ్ ప్రజలు సోషల్ మీడియా వేదికగా భారత్ కు తమ మద్దతును తెలుపుతున్నారు. కొన్ని భారతీయ మీడియా సంస్థలు మన సైనికుల ధైర్య సాహసాలను శంకిస్తూ కథనాలు రాస్తున్న నేపథ్యంలో పొరుగు దేశాల నుంచి ఇలాంటి మద్దతు లభించడం విశేషం.

ఈ పోస్టుపై భారతీయులు తైవాన్ కు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుతున్నారు. హంగ్ కాంగ్ – తైవాన్ లు కూడా చైనా కుట్ర పూరిత చర్యలకు బలైన వారే. ఇటీవల హంగ్ కాంగ్ కు సంబందించిన నేషనల్ సెక్యూరిటీ లా ను చైనా ఆమోదించడంతో చైనాకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేసారు. ఇప్పుడు అణ్వాయుధాలు కలిగిన భారత్ లాంటి దేశం చైనా ను ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించడంతో తైవాన్ లాంటి చిన్న దేశాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

Related News