logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆ అధికారం ఉంది.. జేపీ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపైనా, ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల పైన లోక్‌స‌త్తా వ్య‌వ‌స్థాప‌కులు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న ఓ టీవీ చ‌ర్చ‌లో మాట్లాడుతూ… రైతుల ఉచిత విద్యుత్ క‌నెక్ష‌న్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దే అని చెప్పారు. ఎంత విద్యుత్ వాడుకుంటున్నార‌నే అంశంపై ఒక లెక్క ఉండాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌తంలో వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌న‌ప్పుడు కూడా మీట‌ర్లు పెట్టాల‌ని తాను చెప్పిన‌ట్లు గుర్తు చేశారు.

ఇక ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో కోర్టుల జోక్యం ప‌ట్ల కూడా జేపీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏ వ్య‌వ‌స్థ వాటికి సంబంధించిన ప‌నులే చేయాల‌ని, కానీ మ‌న దేశంలో ఒక వ్య‌వ‌స్థ విధుల్లోకి మ‌రో వ్య‌వ‌స్థ జోక్యం చేసుకుంటోంద‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో కోర్టులు జోక్యం చేసుకోవ‌డాన్ని తాను స‌మ‌ర్థించ‌న‌ని ఆయ‌న పేర్కొన్నారు.

రాష్ట్రానికి రాజ‌ధాని ఎక్క‌డ ఉండాలో నిర్ణ‌యం తీసుకునే స్వేచ్ఛ ప్ర‌జ‌ల ద్వారా ఎన్నికైన ప్ర‌భుత్వానికి ఉంటుంద‌ని జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ పేర్కొన్నారు. మ‌నం ఓటు వేసిన ప్ర‌భుత్వానికి నిర్ణ‌యాలు తీసుకునే అధికారం ఉంటుంది. ఆ నిర్ణ‌యాలు మ‌న‌కు న‌చ్చ‌క‌పోతే నిర‌స‌న తెలిపే అధికారం మ‌న‌కు ఉంటుంద‌ని, అంతేకానీ అస‌లు చేయ‌వ‌ద్ద‌న‌డం స‌రికాద‌ని జేపీ పేర్కొన్నారు.

Related News