logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

లాక్ డౌన్ దిశగా హైదరాబాద్.. సరిహద్దుల్లో నిలిచిపోయిన వాహనాలు..!

హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో నగరం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్ట్టు వార్తలు వస్తున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపులతో పొరుగు రాష్ట్రాలకు పయనమైన నగరవాసులంతా మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారనే భయంతో తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

ముఖ్యంగా ఆంధ్రా – తెలంగాణ చెక్ పోస్టుల్లో భారీగా వాహనాలు నిలిచాయి. దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్, పతంగి, కోరపహాడ్ టోల్ ప్లాజా, హైదరాబాద్ – వరఁగల్ హైవేపై మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా రిజిస్టేషన్లు, పాస్ లు లేని వాహనాలను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. రామాపురం చెక్ పోస్ట్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. వాహనదారులకు తనిఖీలు నిర్వహిస్తున్న తెలంగాణ రెవెన్యూ సిబ్బంది వారందరికీ హోమ్ క్వారెంటైన్ ముద్ర వేసి పంపిస్తున్నారు. వీరంతా నగరానికి వచ్చినా 14 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్ లో ఉండవలసి ఉంది.

Related News