logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మళ్ళీ లాక్ డౌన్ పై కీలక నిర్ణయం: మంత్రి అనిల్

రానున్న రెండు మూడు రోజుల్లో లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేసారు. నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటికే దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం కరోనా సంజీవని బస్సులను నడుపుతుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా టెస్టులు వేగంగా జరుపుతున్నామని 36 గంటల్లో ఫలితాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే వారి కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలని అలాగే ప్రతి సారి కరోనా పరీక్షలు నిర్వహిస్తూ తీవ్రతని గుర్తించాలని ఆదేశించామన్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా ఆకేసులు పెరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ విధించే విషయంపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటింస్తామన్నారు. కాల్ సెంటర్ ద్వారా సేవలు అందిస్తామన్నారు.

అలాగే ప్రజలకు కరోనా లక్షణాలు వస్తే ఎలా సంప్రదించాలని విషయం పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయితే ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న లోపాలు తలెత్తడం సహజమని వాటిని మీడియా పెద్దది చేయడం సరికాదన్నారు. తమ ఇంట్లో పనివారికి కరోనా వచ్చినా జాగ్రత్తలు తీసుకుంటూ మేము పని చేస్తున్నామని పేర్కొన్నారు. జూమ్ పార్టీ బయటకు రాకుండా విమర్శలు చేస్తుందని మంత్రి టీడీపీపై పరోక్షంగా విమర్శలు చేసారు.

Related News