logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

మళ్ళీ లాక్ డౌన్.. కేంద్రాన్ని అనుమతి కోరిన సీఎం!

కరోనా సెకండ్ వేవ్ భారత్ ను వణికిస్తోంది. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒక్కసారిగా రెట్టింపవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు 4 వేల కరోనా కేసులు నమోదవుతుండటం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇటీవల కేసులు తగ్గిన సమయంలో ప్రజలు కరోనా నిబంధనలను మరిచారు.

ఇంతలోనే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కలిసొచ్చాయి. ఇక పెళ్లి వేడుకల్లో అయితే 200 మందికి తగ్గకుండా ప్రజలు హాజరయ్యేవారు. స్థానిక మార్కెట్లలో సైతెం ఎలాంటి నిబంధనలు పాటించలేదు. దీంతో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇప్పుడు ప్రతి ఇంటికో కరోనా పేషంట్ ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. కరోనాకు హాట్ స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకుంది. అందుకోసం కేంద్రాన్ని అనుమతి కోరామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండో దశ లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే.

Related News