logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..!

రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి ముందే ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ ను అమలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా పేర్కొంది.

తాజా ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొంది. అదేవిధంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం రాత్రి 9:30 గంటలకల్లా అన్ని షాపులు మూసివేయాలని తెలిపింది. అయితే వీటి నుంచి ఎమర్జెన్సీ సేవలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. లాక్ డౌన్ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.

రాష్ట్రంలో జూన్ 30 వరకు విధించిన లాక్ డౌన్ నిన్నటితో ముగియడంతో ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభత్వం అన్ లాక్ 2. 0 పేరుతో సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా తీవ్ర దృష్ట్యా అన్ని ప్రవేశ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News