logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రేకింగ్‌: లాక్‌డౌన్ పొడిగింపు.. కొత్త రూల్స్ ఇవే..!

దేశ‌వ్యాప్తంగా జూన్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీస‌కుంది. అయితే, ఈసారి లాక్‌డౌన్‌ను కేవ‌లం కంటైన్‌మెంట్ జోన్ల‌కే ప‌రిమితం చేసింది. మిగ‌తా ప్రాంతాల్లో లాక్‌డౌన్ నుంచి పూర్తి స‌డ‌లింపులు ప్ర‌క‌టించింది. రాత్రి క‌ర్ఫ్యూ వేళ‌లనూ మార్చారు. ఇక నుంచి రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కే క‌ర్ఫ్యూ ఉండ‌నుంది. అంటే రాత్రి తొమ్మిది గంట‌ల వ‌ర‌కు ప్ర‌జ‌లు బ‌య‌ట ఉండేందుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్ల‌య్యింది.

జూన్ 8 నుంచి హోట‌ళ్లు, రెస్తారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆల‌యాలు, ప్రార్థణ మందిరాలు కూడా జూన్ 8 నుంచి తెరుచుకోనున్నాయి. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మంగ్ పూళ్లు, బార్లు, పార్కులు, ఆడిటోరియంలు, జిమ్‌ల‌ను మాత్రం మూసివేయాల్సిందేన‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. స‌భ‌లు, స‌మావేశాలు, మ‌త‌ప‌ర‌మైన స‌మావేశాలు నిషేదం. విద్యాసంస్థ‌ల‌కు సంబంధించి జులైలో కేంద్రం నిర్ణ‌యం తీసుకోనుంది.

Related News