లేటెస్ట్ సెన్సేషన్ కార్తికేయ- లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. గీత ఆర్ట్స్ బ్యానర్-2 పై అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు.పెగళ్ల పాటి కౌశిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై కార్తికేయ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాలోని ఓ లిలిరికల్ పాటను విడుదల చేశారు.
‘ఎట్టా ఎట్టా ఎట్టా పుట్టావ్ రో ‘ అంటూ సాగే ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా కరుణాకర్ లిరిక్స్ ను రాసాడు. సింగర్ రేవంత్ తనదైన స్టయిల్లో పాడి అలరించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. మరి ఈ సినిమా కార్తికేయపై ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.