logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

పగిలిన పెదవులు మృదువుగా మారాలంటే.. ఇలా చేయండి

చలికాలంలో పెదవులు పొడిబారి అందవిహీనంగా మారతాయి. వాతావరణంలో అతి వేడి, అతి చల్లదనం ముఖంపై కొద ఆప్రభావం చూపుతాయి. అవే పెదవులు పగిలిపోవడానికి కారణాలు. కొన్ని సార్లు శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందని చెప్పేందుకు పగిలిన పెదవులు సూచన. అందుకే వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.

అయితే పగిలిన పెదవులు ముఖాన్ని అందవిహీనంగా మరుస్తాయి. మృతకణాలు పెదవులపై అలాగే ఉండిపోతే అది కూడా హాని కారకమే. కాబట్టి చలి కాలంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పగిలిన పెదవుల సమస్యను తగ్గించవచ్చు. పెదవులు పగిలితే వాటిని తిరిగి మృదువుగా మార్చేందుకు వీటిని ఉపయోగించవచ్చు.

టీస్పూన్‌ బీట్‌రూట్‌ రసంలో అర టీస్పూను చక్కెర, కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులపై రాయాలి. లేదా కొబ్బరి నూనెలో పసుపు, చక్కర కలిపి రాయడం వలన మృత కణాలు తొలగిపోతాయి. ఈ కాలంలో పెదవులు పగలకుండా ఉండటానికి ఇప్పటి నుంచే పెదవులకు వెన్న, గ్లిజరిన్ వంటివి రాయడం వలన ఫలితం ఉంటుంది.

Related News