logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

కాబోయే అధ్యక్షుడికి మన ధర్మపురి పూజారికి మధ్య ఏమిటి సంబంధం ?

అమెరికా అధ్యక్షుడి రేసులో అడుగు దూరంలో ఉన్నాడు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్. తన ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే 40 లక్షల ఆధిక్యంతో జో బిడెన్ ముందుకు సాగుతున్నాడు. ఇక గెలుపు లాంఛన ప్రాయమే అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతుండగా జో బైడెన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ధర్మపురి ఆలయ పూజారి కశోజ్జుల చంద్రశేఖర్ శర్మ బైడెన్ కు వీర తిలకం దిద్దుతున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాదు చంద్రశేఖర్ శర్మ బిడెన్ కు సంబందించిన ఎన్నో విషయాలను వివరిస్తున్నారు. బైడెన్ కు భారతీయుల నుంచి భారీగా మద్దతు రావడం వెనుక చాలానే కారణాలున్నాయట. జో బైడెన్ కు హైందవ మతం అన్నా, ఇక్కడి వారి సంప్రదాయాలన్నా ఎనలేని గౌరవ మర్యాదలు ఉన్నాయని చంద్రశేఖర శర్మ చెప్పుకొచ్చారు. మన పద్దతులపై బైడెన్ ఎనలేని శ్రద్ధ కనబరిచేవారని తనకు ఇప్పటికీ జో బైడెన్ ను కలిసి మాట్లాడేంత చనువు ఉందని అంటున్నారు. అయితే అగ్రరాజ్యానికి అధిపతి కానున్న బైడెన్ కు.. ఓ మారుమూల ప్రాంతమైన ధర్మపురికి చెందిన పూజారికి మధ్య ఉన్న సంబంధ ఏమిటి? బైడెన్ గురించి ఇన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారు అనే విషయం పరిశీలిస్తే పెద్ద కథే ఉంది.

కశోజ్జుల చంద్రశేఖర్ ది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి. ఆయన తండ్రి శివరామ శర్మ బాసర, ధర్మపురి వంటి క్షేత్రాల్లో పనిచేసేవారు. యజుర్వేదం చదువుకున్న చంద్రశేఖర్ కు రెండు దశాబ్దాల కిందట తెలిసినవారి ద్వారా అమెరికాలో పౌరోహిత్యం చేసే అవకాశం రావడంతో ఆ దేశానికి పయనమయ్యారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ కు ఎన్ని సార్లు ప్రయత్నించినా చెన్నై కాన్సులేట్ నుండి వీసా రాలేదు. అదే సమయంలో అమెరికా విల్మింగ్టన్ పట్టణంలోకి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వారు చంద్రశేఖర్ ను అక్కడకు రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆలయం డెలావర్ రాష్ట్రంలో ఉంది. అప్పటికి ఆ రాష్ట్రానికి జో బైడెన్ సెనెటర్ గా ఉన్నారు. చంద్రశేఖర్ పరిస్థితి తెలుసుకున్న జో బైడెన్ వెంటనే అతనికి వీసా వచ్చేలా చొరవ తీసుకున్నారు. ఆ తర్వాత 2003 లో విల్మింగ్టన్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు.

అప్పుడు ఆలయానికి జో బైడెన్ పూజలు నిర్వహించడానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు ఆయన మన సంప్రదాయాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకునేవారు. విగ్రహాలు వివిధ రూపాల్లో, రంగుల్లో ఉండటం వెనుక కారణాలను అడిగి తెలుసుకునేవారట. అలా వీరిద్దరికి పరిచయం పెరిగింది. డోనాల్డ్ ట్రంప్ లా కాకుండా బైడెన్ అన్ని మతాలను, దేశాలను సమానంగా చూస్తారని ముఖ్యంగా హైందవ సంప్రదాయాలంటే బైడెన్ కు ఎంతో మక్కువని తెలిపారు. ఆ రోజు సెనెటర్ గా ఉన్న జో బైడెన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదమంత్రోచ్ఛారణతో తిలకం దిద్ది ఆశీర్వదించానని చంద్రశేఖర్ శర్మ తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అధ్యక్ష రేసులో ముందంజలో ఉండటం పట్ల చంద్రశేకర శర్మ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News