logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

తెలంగాణలో ప్రబలుతున్న కొత్త వ్యాధి.. ఈ లక్షణాలు గుర్తించకుంటే ప్రమాదమే..!

ప్రపంచమంతా కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో తెలంగాణలోమరో అరుదైన అంటు వ్యాధి బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాలో మొదటగా దీనిని గుర్తించారు. అచ్చం పచ్చ కామెర్ల తరహాలో ఉండే ఈ వ్యాధి పేరు ‘లెప్టోస్పీరోసీస్’. ఈ వ్యాధికి సంబంధించి నాలుగు కేసులను గతేడాది కూడా ఇదే జిల్లాలో గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు.

అయితే ఈ వ్యాధికి చికిత్స చేయడం అంత కష్టమైనా పనేమీ కాదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ వ్యాధి లక్షణాలను సరైన సమయంలో గుర్తించలేకపోవడమే అత్యంత ప్రమాదంగా భావిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో లక్షణాలు పచ్చ కామెర్ల తరహాలో ఉండటం వల్ల కొందరు దీనికి కామెర్ల వైద్యం చేయిస్తున్నారు. అయినా తగ్గకపోగా.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యి వ్యక్తులు మరణించే అవకాశం ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధికి సంబందించిన అవగాహన అవసరం..

లెప్టోస్పిరోసిస్ అంటే ఏమిటి?
లెప్టోస్పిరోసిస్ అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి. ఎలుకలు, కుక్కలు, పందులు, పిల్లులు తదితర జంతువుల మూత్రం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడ నీరు నిలిచిపోవడం వలన ఆ నీటిలో ఈ వ్యాధికి కారణమయ్యే బాక్టీరియా అందులో నిలిచిపోతుంది. ఆ నీటిని తాకిన వారికి ఈ వ్యాధి సోకె ప్రమాదం ఉంది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా చర్మం పై పొరలోనుంచి శరీరంలోకి.. ఆ తర్వాత రక్తంలోకి చేరుతుంది.

లక్షణాలు:
మొదట ఈ వ్యాధి జ్వరంతో మొదలవుతుంది. ఆ తర్వాత తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రబడటం కూడా ఈ వ్యాధి లక్షణమే.

చికిత్స:
ఈ వ్యాధి సోకితే 5 రోజులపాటు ఈ తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారు. మొదటి దశలోనే వైద్యులను సంప్రదిస్తే ఆంటీ బయోటిక్స్ ద్వారా నయం చేస్తారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మూత్ర పిండాల వైఫల్యం, రక్తస్రావం, మెదడువాపు వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని, కొందరిలో లివర్ డ్యామేజీ అయ్యి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పాటించవలసిన జాగ్రత్తలు..
వర్షాకాలంలో వచ్చే వరద నీటిలో కళ్ళను ఉంచడం, క్లోరిన్ తో శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్స్ ను ఉపయోగించడం వంటివి చేయకూడదు. వర్షంతో కూడిన వరద నీటిని తాకిన ప్రాంతాలను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలి. ఇంటి పరిసరాల్లో ఎలుకలను చేరనీయకుండా జాగ్రత్త వహించాలి. కలుషిత నీటిని ఎలాంటి అవసరాలకు వినియోగించకూడదు. రోడ్లపై అమ్మే పానీయాలకు దూరంగా ఉండాలి.

Related News