హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ మరాఠి బ్యూటీ. కానీ కొంతకాలంగా లావణ్య కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. దీంతో ఆమె ఆశలన్నీ ఇప్పుడు తాజా సినిమాపైనే పెట్టుకుంది.
సందీప్ కిషన్ తో లావణ్య త్రిపాఠి నటిస్తున్న సినిమా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. మార్చి 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… సందీప్ కిషన్ ను అన్న అంటూ నోరుజారింది. ఆ తర్వాత నాలుక కరుచుకుని కవర్ చేసే ప్రయత్నం చేసింది.
దీంతో అక్కడున్న హీరో అభిమానులు కొంతసేపు అల్లరి చేశారు. సోషల్ మీడియాలో లావణ్య పై పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సందీప్ కిషన్ తో కలిసి పని చేయడం గురించి చెప్పాలంటే సందీప్ అన్నా అంటూ సంబోదించింది. దీంతో వేదిక పై ఉన్నవారంతా ఘొల్లున నవ్వేశారు. ఆ తర్వాత సందీప్ అభిమానులకు అన్న.. నాకు స్నేహితుడంటూ కవర్ చేసింది. తమ హీరోని అన్నా అని పిలవడంతో సందీప్ కిషన్ ఫ్యాన్స్ అంతా హార్ట్ అయ్యారని తెలుస్తుంది. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.