logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

పదహారేళ్లకే కుటుంబాన్ని వదులుకోవలసి వచ్చింది: లావణ్య

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో అనేక మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు సడలింపులు లభిస్తుండటంతో అందరూ సొంత గూటికి చేరుకుంటున్నారు. అందులోనూ సవాలక్ష భయాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ ప్రయాణంలో తమకు వైరస్ సోకితే తమ కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుందనే భయం వారిని వణికిస్తోంది. అయితే అందులో టాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారు.

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన లావణ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అవకాశాల కోసం వెంపర్లాడకుండా వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.  ఆమె సినిమా షూటింగుల కోసం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ కు వచ్చారు. ఆమె కుటుంబం మొత్తం డెహ్రాడూన్ లో ఉంటారు. అయితే అనుకోకుండా కేంద్రం విధించిన లాక్ డౌన్ తో ఆమె హైదరాబాద్ లో చిక్కుకుపోయారు. ఏకంగా ఆరు నెలలు కుటుంబానికి దోరందూరంగా గా గడపవలసి రావడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబానికి దూరంగా గడపడం చాలా బాధాకరం. కానీ ఒంటరిననే భావన ఆంతకన్నా ప్రమాదకరం.

ఈ సమయంలో నేను ఒంటరితనం భారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాను. కుటుంబ సభ్యులతో లేననే విషయం పక్కన పెట్టి ఈ ఖాళీ సమయాన్ని నాలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకొవడంలో దృష్టి పెట్టాను. ఇది నాకు అలవాటే. చిన్ననాటి నుంచి స్వతంత్ర్యంగా బతకాలని అనుకునేదాన్ని. అందుకే పదహారేళ్ల వయసులోనే ఒంటరిగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. అందుకోసం నా కుటుంబాన్ని వదులుకోవలసి వచ్చింది అని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు కూడా డెహ్రాడూన్ కు వెళ్ళవలసి వచ్చినప్పుడు భయపడ్డాను. పీపీఈ కిట్ ధరించి ప్రయాణం చేశాను. ఇంటికి వెళ్లిన మరుక్షణమే కరోనా పరీక్షలు చేసుకున్నాను. అందులో నెగిటివ్ అని వచ్చినా నా జాగ్రత్తల్లో నేను ఉంటున్నాను అని లావణ్య పేర్కొన్నారు.

Related News