logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

షాకింగ్: అభిమానుల ఆందోళనల వెనుక లతా రజనీకాంత్.. ఇదే నిజం!

2017 లో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. చాలా ఏళ్లుగా ఇదే ప్రకటనతో ఊరించిన తలైవా మొన్నటికి మొన్న పార్టీ ప్రకటన కూడా చేశారు. ఇంతలో అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇక పాలిటిక్స్ లేవని కేవలం సేవ మాత్రమే చేస్తానంటూ అభిమానులను నిరాశపరిచారు.

ఈ వార్తను జీర్ణించుకోలేకపోయిన రజనీ ఫాన్స్ ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తలైవా రాజకీయాల్లోకి రావలసిందేనని పట్టుబట్టారు. దీనిపై రజనీకాంత్ మరోసారి క్లారిటీ ఇచ్చుకోవలసి వచ్చింది. మరో ప్రకటన ద్వారా ఇక ఇదే తన తుది నిర్ణయంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటె రజని సతీమణి లతా రజనీకాంత్ కు సంబందించిన ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

తిరువాన్మియూర్‌ రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి భాస్కర్‌ తాజాగా ఓ వీడియోను విడుదల చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలపై రజని ప్రకటన తమనెంతో బాధించిందన్నారు. మాటల మధ్యలో ఆందోళనలు చేపట్టిన వారికి లతా రజనీకాంత్ పరోక్షంగా సాయం చేసారని చెప్పుకొచ్చారు. నుంగంబాక్కం వళ్లువర్‌కోట్టంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి వేదికను, 500 వాటర్ క్యాన్లను, మొబైల్ టాయిలెట్లను లతా రాజనీకాఅంత్ తన మనుషుల ద్వారా సమకూర్చారట. ఆ పనులన్నిటినీ ఆమె అసిస్టెంట్ స్వయంగా పరిశీలించివెళ్లాడట.

ఈ వార్త ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేనప్పుడు ఆందోళనలు చేస్తున్న వారి వెనుక ఉండి ఆమె సాయం చేయడం వెనక అర్థమేమిటి అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. మరికొందరు మాత్రం రజనీ అభిమానులు కావడం వల్ల వారు ఇబ్బంది పడటం చూడలేకే ఆమె అలా చేసి ఉంటారని అంటున్నారు.

 

 

Related News