logo

  BREAKING NEWS

పెరిగిన బంగారం ధరలు.. పడిపోయిన వెండి : 26.03. 2021 బంగారం, వెండి ధరలు

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలు తాజాగా షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైపైకి కదలడంతో ఆ ప్రభావం మార్కెట్ ధరలపై పడింది. దీంతో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ప్రస్తుతం మార్చి 26వ తేదీన అంటే శుక్రవారం రోజున బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైద్రాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఇప్పుడు రూ. 42,010 కి చేరుకుంది. ఒక్క గ్రాము బంగారం రూ. 4,201కి లభిస్తుంది. అదే విధంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ .130 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ప్రస్తుతం రూ. 45,830 కి లభిస్తుంది. అలాగే ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,583 గా ఉంది.

బంగారం ధరలు పెరిగితే వెండి మాత్రం భారీగా పడిపోయాయి. హైద్రాబాద్ మార్కెట్లో కేజీ వెండిధర నిన్నటితో పోలిస్తే రూ. 100 తగ్గింది. కేజీ వెండి ధర రూ. 69,300 ఉండగా.. తులం వెండి ధర రూ. 693 గా ఉంది. బంగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు బంగారం కొనేముందు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.

Related News