లాక్ డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా.. శనివారం మరోసారి బంగారం ధరలు పరుగులు పెట్టాయి. తాజాగా మార్చి 20 వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రస్తుతం హైద్రాబాద్ మార్కెట్లో నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 150 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 42,250 గా నమోదైంది. ఒక్క గ్రాము బంగారం రూ. 4, 225 కు లభిస్తుంది. అదే విధంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర కూడా పెరిగింది. శుక్రవారం మార్కెట్లో రూ. 45,930 గా ఉన్న 10 గ్రాముల బంగార ధర శనివారం నాటికి రూ. 160 కి పెరిగింది.
దీంతో తాజాగా తులం బంగారం ధర రూ. 46,090 గా ఉంది. ఒక్క గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ. 4609 కు లభిస్తుంది. పెరిగిన ధరలు హైద్రాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖలోనే ఇదే విధంగా ఉన్నాయి. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా పరుగులు పెట్టాయి. కేజీ వెండి ధరపై నిన్నటితో పోలిస్తే రూ. 300 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 71,800 గా ఉంది. తులం వెండి ధర రూ. 718 కు లభిస్తుంది.