logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

భారీగా తగ్గిన బంగారం ధరలు: 22. 03. 2021 బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు మరోసారి అంచనాలు తప్పాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారంతా పెట్టుబడులు వెనక్కి తీసుకుని బంగారం పై ఇన్వెస్ట్ చేస్తారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషించారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనించింది. ఆ ప్రభావంతో బంగారం ధరలు పడిపోయాయి. తాజాగా సోమవారం రోజున అంటే మార్చి 22వ తేదీన బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తాజాగా హైరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వినియోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,230 గా నమోదైంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,223 గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 46,070 గా నమోదైంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,607 గా ఉంది. విజయవాడ, విశాఖలోని ఇవే ధరలు ఉన్నాయి..

బంగారం ధరలు పడిపోతే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 71,800 గా ఉండగా తులం వెండి ధర రూ. 718 గా ఉంది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు దారులు బంగారం కొనేముందు మరొక్కసారి బంగారం ధరలను పరిశీలించుకోవడం మంచిది.

 

Related News